కాసిపేట : కాసిపేట మడలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఓఎస్‌డి శరశ చంద్ర ఆకస్మికంగా తనిఖి చేశారు. స్టేషన్‌లో ఉన్న నిషేదిత మావోయిస్టు కదలికలకు చెందిన రికార్డులను, ఇతర స్టేషన్ రికార్డులు పరిశీలించి ఇతర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మిపూర్, కుర్రెగడ్,మద్దిమాడ, పెద్ద ఆరెటిపల్లి, గట్రావ్‌పెల్లి,బుగ్గగూడెం గ్రామాలకు చెందిన యువకులకు పలు క్రీడాకిట్లు, సామాగ్రిని అందించారు. యువత నిషేదిత విప్లవ సంగాల సిద్దాంతాల వైపు ఆకర్శితులు కాకుండా ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్‌ను అనుభవించాలని, క్రీడల్లో రాణించాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు వుంటే సామరస్యంగా చట్టపరిదిలో పరిష్కరించుకోవాలని, గ్రామాల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా చూసే భాద్యత పోలీసులదని, గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. అసాంఘీక కర్యాకలాపాలకు పాల్పడేవారిపై నిఘా వుంటుందని, శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఓఎస్డి వెంట ఏసిపి మహేష్, ఎస్సై విజయేందర్, సిబ్బంది వున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement