జన్నారం,జనవరి13( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ సింగల్ విండో చైర్మన్ శీలం రమేష్ పై ఈనెల 30న అవిశ్వాస తీర్మాణం ఏర్పాటు చేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అందరికీ నోటీసులు జారిచేయాలని హైదరాబాద్ సొసైటీల రిజిస్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఇన్చార్జి డి సి ఓ శ్రీనివాసరెడ్డి శనివారం నోటీసులను స్థానిక సీఈఓ రాజన్న ద్వారా జారీ చేశారు.
ఈ మేరకు సొసైటీ పాలకవర్గంలోని 13 మందిలో చైర్మన్ శీలం రమేష్, వైస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, చైర్మన్ పోటీలో ఉన్న డైరెక్టర్ అల్లం రవి, డైరెక్టర్లు నాయిని సత్య గౌడ్, అనుముల శ్రీనివాస్, బాల్త రాజమౌళి, దుమల్ల సుధాకర్ , వొజ్జల లచ్చన్న, బాదావత్ సత్యనారాయణ, జక్కుల మరియ, జక్కుల , ఎండి సాదు పాషా, కానగంటి స్వరూప రాణిలకు ఈ నెల 30న అవిశ్వాసానికి హాజరుకావాలని నోటీసులు అందజేశారు. ఆ పాలకవర్గంలోని డైరెక్టర్లలో మండలంలోని రేండ్లగూడ వాసి, చైర్మన్ పోటీలో ఉన్న అల్లం రవితో పాటు 10 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనున్నారు. మరొక డైరెక్టర్ కూడా వీరికి మద్దతుగా ఓటు వేయ ఉన్నట్లు సమాచారం. కేవలం చైర్మన్ రమేష్ తో పాటు మరొ డైరెక్టర్ మాత్రమే చైర్మన్ కు మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా రెండు, మూడు ఓట్లు పడనున్నాయి. ఏది ఏమైనాప్పటికీ అవిశ్వాస తీర్మానం మండలంలో చర్చనీయాంశమైంది.