Friday, November 22, 2024

Nirmal Politics – సొంతగూటికి మాజీ మున్సిపల్ చైర్మన్ ‘అప్పాల’ ? త్వ‌ర‌లో పువ్వుకు బై..బై… కారుకి హాయ్.. హాయ్

నిర్మల్ ప్రతినిధి జూన్ 25 ప్రభ న్యూస్ – నిర్మల్ నియోజకవర్గం రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత రెండు మాసాల క్రితం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరడంతో అప్పటినుండి నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయా సమీకరణలు చకచకా మారిపోతున్నాయి ఇటీవల అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.శ్రీ హరిరావు నియోజకవర్గంలో పార్టీ బ‌లోపేతం కోసం నడుం బిగించారు. కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఆయా రాజకీయ పార్టీల్లో బలం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు .

దీంతో అధికార బీఎస్ బీఆర్ఎస్ పార్టీలో కొద్దిగా గందరగోళం నెలకొంది. మంత్రి ఇంద్రకరన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం శ్రీహర్ రావు పార్టీ వేయడంతో ఆయన లోటును తీర్చేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైన తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఇటీవల అప్పల గణేష్ తో పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా వారం రోజుల్లో అప్పల గణేష్ చక్రవర్తి బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆయన అనుచరులతో చర్చలు జరిపినట్లు విశ్వాసనీయ సమాచారం.

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మరోసారి విజయం. నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల నుంచి బలం ఉన్న నేతలను అధికార పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని సమా చారం. మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని పార్టీలో చేర్చేందుకు ఎమ్మెల్సీ దండే విట్టల్ ను రంగం లోకి దింపినట్లు తెలుస్తుంది. గణేష్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డితో ఆయనకు అంతర్గతంగా వైరు ధ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే గణేష్ చక్రవర్తి పార్టీ మారతారని ప్రచారం మొదలైంది. అయితే కొందరు కాంగ్రెస్లో చేరుతారని, మరికొందరు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారని అభిప్రాయపడుతున్న క్ర మంలోనే ఆయన అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

- Advertisement -

కేటీఆర్ ఫోన్ పై చర్చ
బీజేపీ నేత మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్ర వర్తికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ ఆర్ ఫోన్ చేసినట్లు నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారం మొద లైంది. దీనిపై భిన్న రకాలుగా చర్చ జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దండే విటల్ చొరవతో ఇది జరిగినట్లు చెబుతు న్నారు. వెంటనే పార్టీలో చేరాలని భ విష్యత్ కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం .

చక చక మారుతున్న రాజకీయ సమీకరణాలు
మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అధికార పార్టీలోకి చేరితే రాజకీయంగా అనేక మార్పులు చక చక జరుగుతున్నట్టు తెలుస్తుంది.గతంలో అప్పల గణేష్ చక్రవర్తికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన శిష్యుడిగా గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే . బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు తీసుకువచ్చి మున్సిపల్ ఎన్నిక లతో పాటు 2014లో ఎమ్మెల్యే ఎన్నికల్లోను గెలుపొం దిన వ్యవహారంలో గుర్తింపు పొందారు. అయితే ఆ త ర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో విభేదించి దూరమ య్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా మా రుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో మళ్లీ ఆయన అధికార పార్టీ వైపు చూస్తున్నారని ఇందుకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ని ర్మల్ నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది ముఖ్యంగా నిర్మల్ పట్టణంలో అప్పల గణేష్ చక్రవర్తిని బలంగా వ్యతిరేకించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట నడిచిన నేతలు ఆయన చేరికపై నిరసన గళం విని పించే అవకాశాలు ఉన్నాయి. గణేష్ అధికార పార్టీలో చేరితే అధికార పార్టీకి చెందిన కొందరు పార్టీని వీడు తారని కూడా ప్రచారం ప్రచారం ఊపొందుకుంది . ఇంద్రకరణ్ రెడ్డిని విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో గణేష్ చక్రవర్తి పై మంత్రి వర్గీయులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా వాటన్నిటిని పక్కకు పెట్టి పాత కొత్త పార్టీ శ్రేణులను కలుపుకొని వెళ్లి వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్య నేతలను బిఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మంత్రి పావులు కలుపుతున్నట్లు విశ్వాస నీయ సమాచారం.

ఈ వారంలోనే చేరికు ఏర్పాట్లు ..
కాగా గణేష్ చక్రవర్తి అధికార పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారైదని ప్రచారం ఊపందుకుంది. వారం రోజుల్లోఅధికార పార్టీ తీర్థం పు చ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయనతోపాటు ము ఖ్య నేతలు కొందరు కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతారని సమాచారం. ఈ విషయంలో ప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చర్చలు జరిగినట్లు విశ్వాసనీయ సమాచారం . ఇదిలా ఉంటే మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు లోకి రావాలని ఆహ్వానించడంతో. టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి పార్టీలోకి రప్పించేందుకు పాములు కలుస్తున్నట్లు సమాచారం మరో వారం రోజుల్లో పార్టీ మార్పు కాయంగా కనబడుతుంది వారం రోజుల్లో అన్ని విషయాలు తేటచెల్లం కాలున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement