Friday, November 22, 2024

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిధి సేకరణ..

మంచిర్యాల : భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేయడం కోసం, ప్రజా సమస్యలపై మరింత ఉదృతంగా ఉద్యమాలను చేయడం కోసం గడప గడపకు సీపీఐ అనే కార్యక్రమాన్ని నిర్వహించి నిధి సేకరణ చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజల వద్దకు వెల్లి వారి సమస్యలను తెలుసుకొని విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, సీపీఐ పార్టీ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమ నిర్మాణం ఉండటానికి ప్రజల వద్ద విరాళాల సేకరణ చేపడుతున్నామని అన్నారు. అలాగే గత కొంత కాలంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా, ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సమస్యలన్నింటిపై త్వరలోనే కార్యచరణను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాల మీద ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి పౌలు, జోగుల మల్లయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సన్నిగౌడ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మొగిలి లక్ష్మణ్‌, ఏఐవైఎఫ్‌ నస్పూర్‌ మండల కార్యదర్శి మహేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శి మనోహర్‌, ఉపాధ్యక్షుడు గరిగె శ్రీధర్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి రాజేశం, జిల్లా సమితీ సభ్యులు దేవి పోచయ్య, సారంగపాణి, విద్యార్థి నాయకులు, కుష్బూ, అఖిల్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement