Tuesday, November 19, 2024

మంచికి, అభివృద్ధికి మారుపేరు స్వర్గీయ నల్ల భీమ్ రెడ్డి రాంరెడ్డి… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

లక్ష్మణ చందా…. జులై 14, ప్రభ న్యూస్ … : మంచికి, మారుపేరు నల్ల కుటుంబం నల్ల భీమ్ రెడ్డి నల్లా రామ్ రెడ్డిల సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వాడ్యల్ గ్రామంలో నిర్మల్ పంచాయతీ సమితి మాజీ అధ్యక్షులు నల్ల భీమ్ రెడ్డి, ఆయన కుమారులు వద్యాల్ మాజీ సర్పంచ్ నల్ల రామ్ రెడ్డిల విగ్రహలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నల్లభీమ్ రెడ్డి నల్లారామిరెడ్డిలు చేసిన సేవలు చిరస్మన్యంగా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. వారు ఆనాటి కాలంలోనే ముందుచూపుతో సాగునీరు, విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టితో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.

భీమ్ రెడ్డి సమితి అధ్యక్షునిగా గ్రామ సర్పంచ్ గా రామ్ రెడ్డి గ్రామ సర్పంచ్ గా నాయకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని రామ్ రెడ్డి జార్జి రెడ్డి సమకాలీకుడని కొనియాడారు. నల్ల కుటుంబ సభ్యులు గ్రామంలో తమ సొంత స్థలాలను గ్రామపంచాయతీ పశు వైద్యశాల రోడ్డు మార్గానికి ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లారన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్సీ లింగన్న మాట్లాడుతూ… నల్లభిమ్ రెడ్డి నల్ల రాంరెడ్డిలు గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు చేసిన సేవలను క్లుప్తంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ జెడ్పిటిసి రాజేశ్వర్, సర్పంచ్ లలిత రామ్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, నల్ల వారి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, వికాస్ రెడ్డి, కల్పనా రాంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, తహసిల్దార్ కవితా రెడ్డి, మాజీ జెడ్పిటిసి నారా గౌడ్, లింగాగౌడ్, సల్లా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జ్ అల్లోల సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నియోజకవర్గంలో నుంచి వచ్చిన పలు రాజకీయ పార్టీల నాయకులు, నల్ల కుటుంబ సన్నిహితులు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్గీయ నల్ల భీమ్ రెడ్డి రామిరెడ్డి విగ్రహాలకు కుచడి శ్రీహరి రావు నివాళులర్పించారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచాడి శ్రీహరి రావు కార్యక్రమానికి హాజరై రాంరెడ్డి భీమిరెడ్డి విగ్రహాలకు అర్పించారు. ఈ సందర్భంగా వారితో తనకున్న సంబంధాల గురించి గుర్తుచేసుకున్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement