Tuesday, November 26, 2024

ADB: అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం..

రెండు మండలాలకు తెగిపోయిన రవాణా సౌకర్యం….
జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

కాగజ్ నగర్, జూన్ 24(ప్రభ న్యూస్) : కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంధవెల్లి గ్రామంలోని పెద్దవాగు బ్రిడ్జీ తాత్కాలిక అప్రోచ్ రోడ్ కూలిపోవడంతో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నిరవధిక నిరాహార దీక్ష
నిర్వహించారు. వీరికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మద్దతు పలికారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…. కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగు బ్రిడ్జి ఇసుక అక్రమ తవ్వకాల వలన గతంలోనే కూలిపోయింద‌న్నారు. బ్రిడ్జి పుననిర్మాణాన్ని ప్రారంభించి ఏడాది దాటినా అప్రోచ్ రోడ్డు పని పూర్తి కాలేదన్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంచార్జి మంత్రిగా పనిచేస్తున్న సీతక్క కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకుని ఈ బ్రిడ్జి పరిశీలనకు రావడం జరిగిందన్నారు. యుద్ద ప్రాతిపదికన వర్షాలు పడేలోపు ఈ బ్రిడ్జి పున నిర్మాణాన్ని పూర్తి చేసి రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పత్రికా ముఖంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సదరు కాంట్రాక్టర్ కు బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో అతను అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టలేదన్నారు. దీంతో తొలకరి వర్షాలకే నదీ గర్భంలో ఉన్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిందన్నారు.

దీంతో దహేగాం, భీమిని మండలాల 50 గ్రామాల ప్రజలకు కాగజ్ నగర్ పట్టణంతో రవాణా అనుసంధానం తెగిపోయిందన్నారు.
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ… మంత్రి సీతక్క రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించి దాదాపు పది సార్లు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణంలో మిగిలిన పనులు తక్షణమే పూర్తి చేసి ఈ రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని డిమాండ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement