బెల్లంపల్లి : మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డుకు జరగనున్న ఉప ఎన్నికలకు తెరాస తరుపున సుకేషిని భరద్వాజ్ తన నామినేషన్ పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతుల మీదుగా స్వీకరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యుల మద్దతుతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల అధికారి శ్రీనివాస్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సంబంధిత అధికారులు, పట్టణ తెరాస యువ నాయకులు, తెరాస పార్టీ కార్యకర్తలు, తెరాస పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement