Friday, November 22, 2024

TG | ఆస్పత్రిలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ..

చెన్నూరు, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రి పరిసరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం ఆసుపత్రి రికార్డులను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులైన చికెన్‌ గున్యా, డెంగ్యూ మలేరియా ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పారిశుధ్యంపై సలహాలు ఇస్తూ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement