టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ముఖరా(కె) గ్రామస్తులు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) గ్రామస్తులు మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంచ్ స్వీకరించి 2000 మొక్కలను నాటారు. గ్రామంలో ప్రతి ఏటా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా మొక్కలు నాటడం జరుగుతుందని స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని 100% రక్షిస్తామని గ్రామస్తులు ప్రమాణం చేశారు. గ్రామంలో ఇప్పటి వరకు 45,000 మొక్కలు నాటి 100% బ్రతికించామని ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోపాటు ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ వర్షా, సంజీవ్, తిరుపతి, మాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement