చెన్నూర్ ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి రోగులను పరీక్షించారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు లెయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేక్ కార్యక్రమాన్ని ప్రారంభించి రోగులను పరీక్షించారు.