Thursday, September 19, 2024

ADB: రూ.2.16కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శంకుస్థాపన

జన్నారం, సెప్టెంబర్ 18 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మొర్రిగూడ, కిష్టాపూర్-మన్నెగూడ, కామనపల్లి, మందపల్లి, పొన్కల్ శ్రీలంక కాలనీ, తదితర గ్రామాల్లో డి.ఎం.ఎఫ్.టి నిధులు రూ.2కోట్ల 16 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు బుధవారం ఆయన టెంకాయ కొట్టి భూమిపూజలు చేశారు. జన్నారంలో ఉర్దూ మీడియం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని కిష్టాపూర్ సమీపాన రూ.4 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న ఏటీసీ(ఐటిఐ) భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

కామనపల్లి గ్రామంలో నిర్మించనున్న పల్లె దవాఖాన కోసం స్థలాన్ని ఆయన చూశారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 45చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వంతోనే పల్లెల్లోని రహదారుల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నేరవేరుస్తుందని, అర్హులైన ప్రతి రైతుకు రూ.2లక్షల లోపు రుణమాఫీ చేసి తీరుతామని ఆయన తెలిపారు.

దశల వారీగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఠాగూర్ శశికళ, తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈఈ, పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, సీనియర్ నేతలు మిక్కిలినేని రాజశేఖర్, జి.మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, డి.కరుణాకర్, లక్ష్మీనారాయణ, ఎం.డి రియాజ్, ఫసిహుల్ల, ముత్యంరాజన్న, ముత్యం సతీష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement