జైనూర్, (ఆంధ్రప్రభ) ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి సోమవారం మండలంలోని జంగం దీక్ష భూమిలో దీక్ష భూమి గురువు కుముర భగవంతరావు చేతుల మీదుగా జై జంగో జై లింగు దీక్షను స్వీకరించారు.
ఆదివాసీలు తమ పెర్స పెన్ జంగు భాయి పేరట గత 20 రోజులుగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే దీక్షల ప్రారంభోత్సవ కార్యక్రమం వచ్చినప్పుడు తాను 11 రోజుల దిక్షణ స్వీకరిస్తానని చెప్పి మాట ప్రకారంగా దీక్షలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జంగు భాయ్ పేరట దీక్షలు చేపట్టడం ఎంతో పుణ్యం అని ఈ దీక్షల వల్ల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షించే విధంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో దీక్ష భూమి వ్యవస్థాపకులు భగవంతురావు, జై జంగు జై లింగు ఘన్ స0స్థాన్ గౌరవాధ్యక్షులు , జై జంగు జై లింగో దీక్షపరులు పాల్గొన్నారు.