ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు కరెక్టర్, ఎమ్మెల్యే. అవి ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో ఉట్నూరు మండలం వడ్గావ్ నుండి పాటగూడ, హీరాపూర్, లాల్ టేకిడి వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే రేఖా నాయక్ కారులో వెళ్లే మార్గం లేకపోవడంతో ఇద్దరు కలిసి ఆటోలో ప్రయాణించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లను పరిశీలించారు. మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా వేరే వాహనాలలో ప్రయాణించి రహదారులు, వంతెనలు, పంట పొలాలను సందర్శించారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న చోట్ల కాలి నడకన వెళ్లారు.
ఆటో, జీపులో పర్యటన..
వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే రేఖానాయక్ వడగాం గ్రామం నుంచి ఆటోలో బండాపాట గూడ వరకు వెళ్లారు. బండాపాటగూడ తెగిపో యిన రోడ్డు, కోతకు గురైన బ్రిడ్జిలను పరిశీలించి అక్కడ నుంచి వేరే జీపులో హిరాపూర్ గ్రామానికి చేరుకున్నారు. వరద చేరిన ఇళ్లను పరిశీలించి, అక్కడి నుంచి లాల్టేకిడి గ్రామం వరకు వెళ్లారు. దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించి తిరిగి అదే జీపు లో బండా పాటగూడ వరకు వచ్చారు. కోతకు గురైన బండా పాటగూడ రోడ్డు నుంచి ఆటోలో ఎక్కి వడగాం వరకు వచ్చారు. అక్కడి నుంచి వారి వాహనాల్లో కూర్చొని దస్నాపూర్, పిట్టబొంగురం, మర్కాపూ ర్తండా గ్రామాలను పరిశీలిం చారు.