Saturday, November 23, 2024

పాల ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి..

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో రూ.5.6కోట్లతో ఆధునీకరించిన విజయ పాలశీతలీకరణ కేంద్రం..పాల ఉత్పత్తుల కేంద్రాన్ని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు చేయూతను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్యలతో విజయ డెయిరీ బలోపేత‌మైంద‌న్నారు. డెయిరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా అనేక ప‌థ‌కాల‌ను అమలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నార‌ని తెలిపారు.టీఎస్‌డీడీసీఎఫ్ చైర్మన్‌గా లోక భూమా రెడ్డి ఈ ప‌రిశ్రమ అభివృద్ధికి ఎంతో నిబద్ధతో కృషి చేస్తున్నార‌ని ప్రశంసించారు. అదిలాబాద్ జిల్లాకు తలమానికంగా విజయ డెయిరీ యూనిట్ ను నిలిపేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీ నగేశ్, మత్స్య్ పరిశ్రమ, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేంద్ర, ఎండీ శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement