భీమిని: భీమిని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో భీమిని మండల ప్రత్యేకాధికారి ఫణీందర్‌రావు, కార్యదర్శి, ఈజీఎస్ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామపంచాయితీలో చేపట్టిన పల్లె ప్రకృతి, పల్లె ప్రగతి, ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారం నర్సరీ తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా గ్రామపంచాయితీలో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టడంతో పాటు హరిత నర్సరీల నిర్వాహణను సక్రమంగా నిర్వహించి జూన్ నాటికి మొక్కలు సిద్దంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని, ఎక్కడ అలసత్వం వహించినా చర్యలు ఉంటాయని, పంచాయితీ కార్యదర్శులు శ్రద్దతో తమ పనులను చేయాలని సూచించారు. అనంతరం భీమిని పంచాయితీలోని హరిత నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. ప్రత్యేకాధికారి వెంట ఎంపీడీఓ రాధాకృష్ణ, ఎంపీఓ విజయ్‌ప్రసాద్, ఏపీఓ భాస్కర్‌రావు, కార్యదర్శి సత్యనారాయణ రాజు, సిబ్బంది ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement