ఆంధ్రప్రభ స్మార్ట్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం సందర్శించిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి… సమస్యత్మక గ్రామాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. దాంతో ఆదివారం జైనూర్ ప్రభుత్వ వైద్య అధికారి నాగర్ గొంజు అశోక్, వైద్య ఉద్యోగులు, ఆశా వర్కర్లు మండలంలోని మారుమూల గ్రామమైన దబోలి పంచాయతీలోని లోద్దిగూడకు రోడ్డు సౌకర్యం లేకున్న కాలినడకన వాగుదాడుతూ వెళ్లి ఇబ్బందులు పడుతూ గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు చేశారు.
గర్భిణీ మహిళలకు గ్రామస్తుల సహకారంతో జైనూర్ ఆసుపత్రికి తరలించారు. షేకుగూడ నుండి కనీసం నాలుగు కిలోమీటర్ల దూరం రోడ్డు సౌకర్యం లేక అడవుల్లో కాలినడకన లొద్దిగూడకు వెళ్లి వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి వెళ్లాలంటే అధికారులకు ఎన్నో తిప్పలు తప్పవు, గ్రామ మద్యం వరకు సాధారణ మట్టి రోడ్డు మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఆ మారుమూల లొద్దిగూడ గ్రామానికి గుట్టలు దాటుతూ ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిందే. అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారి వైద్య ఉద్యోగులు కిలోమీటర్ల కొలది కాలినడకన వెళ్లి వైద్య సేవలు అందించడం నిర్వహించడం ఆదర్శనీయం.