బెల్లంపల్లి, నవంబర్ 26 (ఆంధ్రప్రభ) : పిల్లలకు మెనూ ప్రకారం, అల్పాహారం, భోజనం అందించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం ఉదయం బెల్లంపల్లి పట్టణంలోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంటలను పరిశీలించారు.
పిల్లల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచడం జరిగిందని, మెనూ ప్రకారం ప్రతిరోజు అల్పాహారం, భోజనం, పాలు, పండ్లు, గుడ్లు అందజేయాలని తెలిపారు. పిల్లలతో మాట్లాడుతూ… పాఠాలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అనేక క్రీడా విభాగాల్లో పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలో గ్రౌండ్ ఇబ్బందిగా ఉందని తెలపడంతో వెంటనే మందమర్రి జీఎంతో మాట్లాడి వెంటనే, గ్రౌండ్ కు కావలసిన మట్టిని అందించాలని ఫోన్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.