బెల్లంపల్లి : మాస్కులు ధరించకుంటే జరిమానాలు తప్పవని, ప్రతీఒక్కరు కరోనా కట్టడికి సహకరించాలని తాళ్లగురిజాల ఎస్సై సమ్మయ్య అన్నారు. బెల్లంపల్లి పోచమ్మ దేవాలయం సమీపంలో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. సెకండ్ వేవ్ కరోనా ఉధృతంగా విస్తరిస్తుందని, ప్రతీఒక్కరు కరోనా కట్టడిలో తమవంతు బాధ్యతగా మాస్కులు ధరించాలని, రద్దీ ప్రదేశాల్లో తిరగవద్దని, ప్రతీఒక్కరు భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement