విజయవాడ /మంచిర్యాల – మోస్ట్ వాటెండ్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇదే సందర్భంగా అతడి భార్య విజయలక్షీని కూడా అదుపులోకి తీసుకున్నారు. చత్తీస్ గడ్ లో మోకాలికి ఆపరేషన్ చేసుకుని విజయవాడకు రైలులో వచ్చిన భార్యభర్తలు వచ్చిన సందర్భంగా తెలంగాణకు చెందిన మంచిర్యాల పోలీసులు రైల్వేస్టేషన్ లోనే అదుపులోకి తీసుకున్నారు.. ప్రకాశం జిల్లాకు చెందిన అభయ్ పలు విధ్వంసం కేసులలో అరెస్టై విశాఖ జైలులో ఉన్నాడు.. ఇటీవలే అతడు బెయిల్ పై విడుదలై చత్తీస్ గడ్ కు వెళ్లిపోయాడు.. భార్య విజయలక్షీ కూడా మావోయిస్ట్ కార్యకలాపాలలో చురుగా పాల్గొన్నట్లు పోలీసులు వివరించారు.. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో మావోయిస్ట్ పార్టీ బలోపేతానికి ఇటీవలే ఈ ఇద్దరు ఆ ఏరియాలో పలు సమావేశాలు నిర్వహించినట్లు మంచిర్యాల పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా వారి కదలికలపై దృష్టి పెట్టి విజయవాడలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి సెల్ ఫోన్ లు, ల్యాప్ ట్యాప్ లు, కొంత విప్లవ సాహిత్యం పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement