కాసిపేట: చిన్నారి వైద్యఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబసభ్యులకు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు. కాసిపేట మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన కనకం తులసి చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో వైద్యం పొందుతున్న విషయం తెలుసుకున్న చిన్న ధర్మారం గ్రామానికి చెందిన జ్యోతి గ్రామ మహిళ సంఘం సభ్యులు వైద్యఖర్చుల నిమిత్తం కొంత సహాయాన్ని చేయాలని తలిచారు. పేదింటి కుటుంబానికి, పాప వైద్యానికి తమ వంతు సహాయంగా రూ.10వేలను పాప కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎపీఎం వెంకటేశ్, గ్రామ సంఘం ప్రతినిధులు పుష్పలత, శాంత, శారధ సభ్యులు పాల్గొనారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement