మట్టి గణపతినే పూజిద్దామని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని క్లిమోమ్ ఆధ్వర్యంలో తయారు చేసిన గోమయ వినాయక ప్రతిమలను సోమవారం శాస్త్రినగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లిమోమ్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా గోమయ వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో వీటిని అందజేస్తున్నామని తెలిపారు. గోమయం, మట్టితో తయారు చేసిన విగ్రహాలతో ఎలాంటి హాని ఉండదని, కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement