బెల్లంపల్లి ఏప్రిల్ 1 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలం మెట్పల్లి గ్రామం నుండి 17వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో అడుగడుగునా జన నీరాజనాలతో పాదయాత్ర సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తామని బట్టి విక్రమార్క అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలోని ఎస్టీ కాలనీలో మహిళలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా పోడు పట్టాలు ఇచ్చే బాధ్యత మాదే అని హామీ ఇచ్చారు. శనివారం పాదయాత్రలో గిరిజన మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షస రాజ్యం ఉందని రానున్నది, కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వెంట ప్రతి ఒక్కరు నడవాలన్నారు.