Tuesday, October 29, 2024

Land kabja – వెంక‌న్నే దిగొచ్చినా..త‌న భూముల‌ని నిరూపించ‌లేడు

ఆల‌య భూములంటే అంద‌రికీ అలుసే.. అందుకే ఆల‌య‌, మ‌ఠం భూములను అప్ప‌నంగా దొబ్బేయ‌డానికి చాలామంది ప్లాన్ వేస్తుంటారు. దీంతో ఈ భూములు ఈజీగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వుతున్నాయి. వీటిని అరిక‌ట్ట‌డంలో అధికారుల అల‌స‌త్వం కూడా ఉంది. దీంతో అవి ప‌రాయిల చేతుల్లోంచి అమ్మ‌కానికి పోతున్నాయి. ఇట్లా ఇర‌వై ఏళ్ల కింద నిర్మ‌ల్ జిల్లా సోన్ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి మ‌ఠానికి చెందిన 7.12 ఎక‌రాల భూమి ఆక్ర‌మ‌ణ గురైంది. ఈ భూమి కాస్త ఇప్పుడు ఇద్ద‌రి పేరుతో రిజిస్ట్రేష‌న్ కూడా అయిపోయింది. ఇప్పుడు సాక్షాత్తూ ఆ వేంక‌టేశ్వ‌ర స్వామి దిగివ‌చ్చినా అవి త‌న భూములేన‌ని నిరూపించుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ======================!

ఆల‌య భూములకు ఆధారాలు మాయం

సోన్‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి మ‌ఠం భూముల ఆక్ర‌మ‌ణ‌

ఇర‌వై ఏళ్ల కిందట జ‌రిగిన‌ భూబాగోతం

ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాని వైనం

- Advertisement -

ఇద్ద‌రి పేరుతో 7.12 ఎక‌రాల‌ అక్ర‌మ‌ రిజిస్ట్రేష‌న్‌

ఫిర్యాదులందినా చ‌ర్య‌లు తీసుకోని అధికారులు

క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువెళ్తానంటున్న‌ ఆల‌య ఈవో

ఆంధ్ర‌ప్ర‌భ‌, సోన్ : నిర్మల్ జిల్లా సోన్‌లో ఉన్న అతిపురాత‌న‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి మ‌ఠానికి చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. 482 సంవ‌త్స‌రాలు గ‌ల ఈ మ‌ఠం ఆల‌నాపాల‌న కోసం 42.18 ఎకరాల భూములు ఉండేవి. ఇందులో 7.12 ఎక‌రాల భూమి సుమారు 20 ఏళ్ల కింద‌ట ఇద్ద‌రు వ్య‌క్తులు ఆక్ర‌మించుకున్నారు. అప్ప‌ట్లో ఉన్న ఓ అధికారి చేతివాటంతో ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. ఆ భూములు అన్యాయ‌కాంత్ర‌మ‌య్యాయ‌ని ఆ గ్రామ‌స్థులు, బ్రాహ్మ‌ణ సంఘం నేత‌లు ఎన్నో సార్లు అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకునే దాఖ‌లాలు లేవు.

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం భుదిగొండ గ్రామంలో ఉన్న 7.12 ఎకరాలు మ‌ఠానికి సంబంధించిన భూముల‌ను కృష్ణారెడ్డి, రుక్మాభాయ్‌ పేరుల మీద అక్ర‌మ‌ రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన‌ట్టు గుర్తించిన గ్రామ‌స్థులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్‌పై ఫిర్యాదులు అందినా..ఈ అక్ర‌మ రిజిస్ట్రేష‌న్‌పై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ప‌ట్టించుకోలేద‌ని బ్రాహ్మ‌ణ‌ సంఘం అధ్యక్షుడు, సోషల్‌ వర్కర్‌ దొడ్లే రామారావు, గ్రామ‌స్థులు ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి మఠం ఈ ఓ భూమయ్య వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా ఆదిలాబాద్‌ జిల్లా నేరడి గొండ మండలం భుదిగొండ గ్రామంలో ఉన్న 7.12 ఎకరాల భూమి కృష్ణారెడ్డి, రుక్మాభాయ్‌ పేర్లతో అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన మాట‌ వాస్తవమే అన్నారు.

ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఆలయ భూముల‌ను ప‌క్క‌నున్న రైతులు త‌మ పొలల్లో క‌లుపుకుంటున్నార‌ని తెలిపారు. ప్ర‌తి రెండేళ్ల‌కోసారి 7.12 ఎక‌రాలు మిన‌హాయించి మిగిలిన భూమి వేలం పాట ద్వారా లీజుకు ఇస్తున్నామ‌న్నారు. మ‌ఠం భూములు స‌ర్వే చేయించాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరిన‌ట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement