బెల్లంపల్లి : ఏప్రిల్ 1వ తేది నుండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను అమలు జరిపే విధానాలను ఉపసంహరించుకోవాలని బెల్లంపల్లి సింగరేణి సివిల్ కార్యాలయం ముందు 4 లేబర్ కోడ్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం 43 కార్మిక చట్టాలను, నాలుగు కోడ్‌లను కార్పోరేటర్లకు అనుకూలంగా, స్వదేశీ, విదేశీ చట్టాలకు అనుకూలంగా కార్మికులు శాతాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కార్పోరేటర్లకు కట్టబెట్టడం దేశద్రోహమే తప్ప దేశభక్తి కాదని అన్నారు. ఈ ముర్ఖత్వ విధానాలను తుదముట్టించేవరకు అసంఘిట కార్మికులు తమ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి చరణ్, కృష్ణవేణి, నారాయణ, వెంకటి, గణేష్, బానేష్, కొమురయ్య, అమృత, బుచ్చన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement