వేమనపల్లి : మండల కేంద్రంలోని పిహెచ్‌సిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాన్ని మండల జెడ్‌పీటీసీ ఆర్.స్వర్ణలత-సంతోష్‌కుమార్, ఎంపీపీ స్వర్ణలత, జిల్లా అధికారి సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు పాలు, బ్రెడ్‌లను పంపిణీ చేసి వారి వెంట ఉన్న కుటుంబసభ్యులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మధూకర్, మధు, వైద్యాధికారి కృష్ణ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇంచార్జి చెన్నూరి సమ్మయ్య, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు సాబీర్ అలీ, నాయకులు అబీద్‌ఖాన్, కోడూరి దుర్గయ్య, మంత్రి రమేష్, బొద్దున రాంచందర్, ఆవులమారి పున్నం, ఎల్లల శేఖర్, హనుమాండ్ల పోశం, దోమల సత్యనారాయణ, కుమ్మరి శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్లు రాంశెట్టి బాపు, లింగయ్య, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు మంజుల, మాధవి, ఎల్.టి.సౌందర్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement