Tuesday, November 26, 2024

చేయని నేరానికి నిందలు..

కాసిపేట : చేయని నేరం ఏల్లుగా వెంటాడుతున్న అవమానాలు భరిస్తూ, మండలి చైర్మన్‌ మింగిన డబ్బులకు అధికారులు అతన్ని కూడ బాద్యుడిని చేసిన చెల్లించమనిన డబ్బులు చెల్లించినప్పటికి వాటికి రసీదులు ఇవ్వకుండా, ఉద్యోగంలోకి తీసుకోకుండా మానసికంగా వేదింపులకుగురిచేస్తున్నప్పటికి, అన్నిటిని భరిస్తూ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని పాలకమండలి సభ్యులు, అధికారులను కాల్లవేళ్ళా పడి వేడుకున్న కనికరించడం లేదని, పని లేక కుటుంబం గడవక ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోతున్న నేపద్యంలో బతుకుభరోసా కల్పించాలని లేకుంటే మరణమే శరణ్యమని మనోవేదనను వ్యక్తం చేశాడు. విధుల్లో సస్పెండ్‌ అయిన ఉద్యోగి. వివరాలలోకి వెళ్ళితే….కాసిపేట మండలం ధర్మారావుపేట ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలో సీఇఓగా విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయిన కోడూరి భద్రయ్య ఆవేదన. 2014-15లో వున్న పాలకవర్గం చైర్మన్‌ పుస్కూరి నర్సింగరావు (మృతుడు) సహాకార సంఘానికి చెందిన రైతుల సొమ్ము 15 లక్షల రూపాయలు స్వాహా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు చైర్మన్‌ నర్సింగరావుతో పాటు అప్పటి సిఇఓ భద్రయ్య,క్లర్క్‌ బాద్యులుగా తేల్చి డబ్బులు చెల్లించాలని నోటీస్ లు ఇచ్చారు. 2019లో విధుల నుండి భద్రయ్యను సస్పెండ్‌ చేశారు. కాసులు మింగింది ఒకరైతే విధుల నుండి సస్పెండ్‌ చేయడం, వేతనాలు నిలిపి చేసి మానసికంగా వేధింపులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికి భార్య బంగారు నగలు అమ్మి, అప్పులు తెచ్చి 2020 మే నెలలో 3 లక్షలు, అదే ఏడాది ఆగస్టులో 2.35 లక్షలు డిసిఓకు చెల్లించినట్టు తెలిపాడే. నా వాటా డబ్బులు చెల్లించా, ఉద్యోగంలోకి తీసుకోవాలని పాలకవర్గం, అధికారుల చుట్టు తిరిగిన పట్టించుకోవడం లేదని, నా భార్య
పిల్లలతో పోయి డిసిఓ కాళ్ళపై పడినా కనకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సహాకార సంఘంలో 25 ఏళ్ళుగా విధులు నిర్వహించానని, మొదట్లో నెలకు 300 వేతనంతో పని చేశానని, ఏనాడు మచ్చలేకుండా రైతులతో సంబందాలు కలిగి సంఘం అభివృద్దికి పని చేసిన నేను, చైర్మన్‌ చేసిన అక్రమాల్లో నన్ను ఇరికించిన అధికారులు నా మనోభావాలను కించపరిచారని, అయినప్పటికి సంఘంపై వున్న అనుబంధంతో నేను చేసిన విధుల్లోనే ఉద్యోగం కల్పించాలని లేదా సస్పెండ్‌ అయిన సమయానికి ముందు నాలుగు నెలలు, ఆ తర్వాత 14 నెలల వేతనాలకు సంబందించిన బకాయిలను చెల్లించాలని వేడుకుంటున్న కనికరించడం లేదని, అడగడానికి వెలితే అమర్యాదగ ప్రవర్తిస్తున్నారని నన్ను మరింత కుంగతీస్తున్నదని భాదను వ్యక్తం చేస్తున్నారు భద్రయ్య, అతని కుటుంబ సభ్యులు. పని లేక, జీతం లేక ఆర్థికంగా ఆదుకునే వారులేక కుటుంబం గడవడం కష్టంగా మారిందని, నేను నా కుటుంబం బతకడానికి భరోసా కల్పించాలని అధికారులను, ప్రజాప్రతినిదులను. సహకార సంఘం పాలక సభ్యులను వారు వేడుకుంటున్నారు.
అన్యాయంపై స్పందించాలి జీతం లేదు, చేసేందుకు పని లేదు, వచ్చిన ఆరోపణల్లో తన ప్రమేయం లేకున్న మధ్యతరగతి కుటుంబానికి చేందిన భద్రయ్య ఆవేదనపై స్పందించాల్సిన భాద్యత నాయకులు, ప్రజాప్రతినిదులపై వుంది. పేద కుటుంబానికి చెందిన బద్రయ్య బతుకు భరోసా కావాలని సమాజాన్ని వేడుకుంటున్నాడు. ఆ దిశగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే భద్రయ్య ఊరు పక్కనే అప్పుల భాదతో ఇల్లు గడవక కౌలు రైతు కుటుంబంబలిదానం చేసుకుంది. అతని అదే విధమైనా వేదన. ఎకరం భూమి వున్న, పది లక్షల అప్పు ఇచ్చే వారున్న మా కుటుంబం బతికేదని, మద్య తరగతి కుటుంబాలకు ఇజ్జత్‌ ఎక్కవ… అని తన సుసైడ్‌ నోట్‌లో రాసిన విషయం మండల ప్రజల మదిలో మెదులుతూనే వుంది.సమస్యల పరిష్కారానికి బలవన్మరణాలు కాకపోయిన భరోసా ఇచ్చేవారు లేక, ధైర్యం చెప్పె వారు లేక కొంత మంది బలహీన క్షణాలకులోనై ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారనే విషయం తెలిసిందే… ఈ నేపద్యంలోనే భద్రయ్య కుటుంబానికిఅండగా, అతనికి న్యాయం జరిగేలా బాద్యతగల అధికారులు, నాయకులు స్పందిచాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement