భీమిని : మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ గ్రామపంచాయితీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. గ్రామపంచాయితీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు గ్రామపంచాయితీని అభివృద్ధితో శోభాయమానంగా తీర్చిదిద్దాయి. కేస్లాపూర్ పంచాయితీలో ప్రభుత్వ పథకాలను స్థానిక సర్పంచ్ ముసుకు సురేష్ అధికారుల సహకారంతో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామపంచాయితీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పథకంలో భాగంగా నర్సరీల అభివృద్ధి పల్లె ప్రకృతి
వనం, రైతువేధిక, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు పనులను పూర్తి చేసుకొని జిల్లాలో రెండవ స్థానంలో నిలవడమే కాకుండా జిల్లా కలెక్టర్ ప్రశంసలు అందుకుంది. కార్యదర్శి సురేష్, ఏపీఓ భాస్కర్‌రావులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ మాజీ ఎంపీటీసీ, తెరాస నేత ముత్యం సుదర్శన్ గౌడ్ సహకారంతో జిల్లాలో మంచి పేరు తీసుకువచ్చారు. ఈ గ్రామపంచాయితీకి ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పంచాయితీలో పంచాయితీలో ఇంకుడుగుంతల నిర్మాణం, రైతులకు వరి కల్లాల మంజూరు, వాటి నిర్మాణంలో ఎంతో ప్రగతిని సాధించారు. ఇలా అన్నింటిలో ముందు నిలుస్తూ మండలాల్లో పంచాయితీని మందువరుసలో నిలపడం అభినందించదగ్గ విషయం. జూన్, జూలై నెల ప్రారంభమయ్యే నాటికి హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్దంగా ఉంచడం కోసం వన సంరక్షకుని సహకారంతో కృషి చేస్తున్నారు. మొత్తానికి గ్రామపంచాయితీలో పల్లె ప్రగతిలో చేపట్టిన అన్ని పనులను పూర్తి చేసుకొని ప్రగతి పథంలో కేస్లాపూర్ దూసుకుపోతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధికారుల కృషి, సర్పంచు, స్థానిక నేతల సహకారంతో జిల్లాలోనే మండలంలో ముందువరుసలో నిలిచింది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న కేస్లాపూర్..
Advertisement
తాజా వార్తలు
Advertisement