శ్రీరాంపూర్, జూన్ 12 (ప్రభ న్యూస్) : మంచిర్యాల సభలో కేసీఆర్ మంచిర్యాల జిల్లాపై వివక్ష చూపడాన్ని, సింగరేణి కార్మికులకు మాయ మాటలు చెప్పి కార్మికులకు మోసం చేశారని, దీన్ని ఖండిస్తూ సోమవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ మంచిర్యాల జిల్లాకు వస్తే ఎన్నో వరాలు ప్రకటిస్తాడని జిల్లా ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూసారని, కానీ జిల్లా ప్రజలకు కేసిఆర్ మొండి చెయ్యి చూపించారన్నారు.
గత ఎన్నికల్లో సమయంలో సింగరేణి కార్మికులకు కేసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, సింగరేణి కార్మికులకు 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ ప్రకటించిన కేసిఆర్ అవి సింగరేణి కార్మికులకు కష్టపడి బొగ్గు తీస్తే వచ్చిన ఆదాయం తప్ప కేసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయించింది కాదన్నారు. బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సింగరేణి సంస్థకు ఉన్న బకాయిలు అన్ని చెల్లిస్తామని కార్మికులకు పర్క్స్ పై విధిస్తున్న ఆదాయపు పన్ను రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అగల్ డ్యూటీ రాజు, పానుగంటి మధు, సత్రం రమేష్, తోట మల్లికార్జున్, మిట్టపల్లి మొగిలి, సమ్రాజ్ రమేష్, మడిషెట్టి మహేష్, కుర్రే చక్రి, సిరికొండ రాజు, తడురి మహేష్, కామ రాజు, తదితరులు పాల్గొన్నారు.