Tuesday, November 26, 2024

KCR – ధ‌ర‌ణి పోర్ట‌ల్ తోనే అవినీతి అంతం …..

మంచిర్యాల, ఆంధ్రప్రభ బ్యూరో: ”అవినీతికి, దళారీ వ్యవస్థకు తావులేని రీతిలో ధరణిని అందుబాటు-లోకి తెచ్చాం… దాంతో భూముల క్రయవిక్రయాల్లో అవినీతిని అంతమొందించాం. ధరణి లేక పోతే… మళ్లీ లంచగొండి వ్యవస్థ తయారవుతుంది. రైతుల ఉసురు తీస్తుంది… ధరణి లేకుంటే రైతుబంధు ఎలా వస్తుందో ఆలోచించాలి… ధరణి పోర్టల్‌ను బంగాళఖాతంలో కలుపుతామనే కాంగ్రెసోళ్లనే సముద్రంలో వేయాలి” సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిర్యాల సమీపంలోని నస్పూర్‌ వద్ద జరిగిన బహిరంగసభలో పాల్గొన్న సీఎం కాంగ్రెస్‌, బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ”నేడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు పది రోజుల్లో వారి అకౌంట్లలో పడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో రైతు చనిపోతే ఆపద్బంధు పథకం కింద 50 వేలు ఇస్తామని చెప్పేటోళ్ళు. చివరికి తిరగగా తిరగగా రైతు చేతిలో పదివేలో ఇరవై వేలో పెట్టి పంపించేటోళ్ళు. రైతుబంధు పథకం కింద సంవత్సరానికి పదిహను పదహారు వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. ఇవన్నీ ధరణితోనే సాధ్యమవుతున్నాయి. రైతులు వడ్లు అమ్మినాక ఐదారు రోజుల్లో వారి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. ఈ సదుపాయాలన్నీ ధరణితోనే వచ్చాయి. ఇవ్వాళ ఎంతో సులభంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. గతంలో ఎంతో గోస ఉండేది. రైతులను అద్భుతంగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవన్నీ చేపట్టింది. తెలంగాణ మొత్తం భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలుంటే, ధరణిలోకి 1 కోటి 55 లక్షల ఎకరాల భూమి ఎక్కింది. ప్రకృతి సంపద పోనూ ధరణిలో దాదాపు 99 శాతం భూమి నమోదైంది. భూముల క్రయవిక్రయ అధికారం వీఆర్వోలు, ఎమ్మార్వోల దగ్గరుండేది. కానీ ఆ అధికారం నేడు రైతులకు దక్కింది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. మీ చేతి బొటనవేలితోనే అది సాధ్యమైతది. ఎలక్షన్లు రాంగనే జాతర మొదలైంది. మేం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నది. ధరణి పోర్టల్‌లో ఎక్కడున్నా వారి వారి భూముల పై యాజమాన్య హక్కులను చూసుకోవచ్చు. ఎవడైతే ధరణి పోర్టల్‌ను తీసేస్తా అంటున్నడో వారినే గిరా గిరా తిప్పి బంగాళాఖాతంలో పడేయాలి. మళ్ళా రాజ్యం దళారుల భోజ్యం కావద్దనుకుంటే, ప్రజాస్వామ్యం బతికుండాలంటే, మీకొచ్చిన అధికారం మీ దగ్గరుండాలంటే ఎవరికి ఏ శిక్ష విధించాలో మీకు తెలుసు” అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అప్పులు తెచ్చి కేంద్రానికి 49 శాతం వాటా కట్టబెడితే, భాజపా సర్కారు బొగ్గుగనులను ప్రైవేటీ-కరిస్తూ, సిరుల సంస్థను మూసేయాలని చూస్తోందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు.

కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు- నిర్మించుకుంటు-న్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని గుర్తుచేసిన సీఎం, నేడు జిల్లా కేంద్రాల్లో పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో నేడు తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. ఉచిత విద్యుత్‌, నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్నారు.

వరి ధాన్యం ఉత్పత్తిలో టాప్‌!
యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఒక్క తెలంగాణలోనే ఈ ఏడాది యాసంగిలో 56 లక్షల 40 వేల ఎకరాల్లో మనం వరి సాగు చేశామని తెలిపారు. 3 కోట్ల పైచిలుకు మెట్రిక్‌ టన్నుల ధాన్యోత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కోటి టన్నుల పండిస్తేనే ఎక్కువన్న భావనతో ఉన్న పాలకులు నేడు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల పంజాబ్‌ కన్నా మనవద్దే ధాన్యోత్సత్తి ఎక్కువగా ఉందన్నారు. సమృద్ధిగా సాగునీరు ఇవ్వడంతో పాటు 2600 వ్యవసాయ క్లస్టర్లను నెలకొల్పి రైతాంగానికి అధునాతన సాంకేతిక ఫలాలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికీ భారత్‌ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటు-ందన్నారు. ఇంతటి పెద్ద వనరులున్న దేశంలో ప్రతియేటా సుమారుగా లక్ష కోట్ల విలువైన ఆయిల్‌ఫాంను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ బాధ నుంచి తప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం తోటలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు ప్రారంభించిందని సీఎం తెలిపారు.

- Advertisement -

రూ.500 కోట్లతో పామ్‌ ఆయిల్‌ పరిశ్రమ
మంచిర్యాలలో రూ.500 కోట్లతో పామ్‌ ఆయిల్‌ పరిశ్రమ ఏర్పాటు- చేస్తున్నామమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘తలాపున పారుతోంది గోదారి.. మనచేను, మన చెలక ఎడారి’ అని సదాశివం పాట రాశారు. తెలంగాణ వచ్చాక ఇప్పుడు నీటి గోస తీరిందన్నారు. వేలాది మందికి అన్నం పెట్టిన సంస్థ సింగరేణి అని వ్యాఖ్యానించారు. ఇవాళ సింగరేణి టర్నోవర్‌ను రూ.33 వేల కోట్లకు పెంచామన్నారు.
తెలంగాణలో ఉన్నట్లు- గురుకులాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్న కేసీఆర్‌.. ఆ విద్యార్థులు చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు. ఎన్నికల్లో గ-్టట-క్కడానికి మోసపూరిత మాటలు చెబుతున్నారని సీఎం పేర్కొన్నారు.

అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన చెన్నూరు ఎత్తిపోతల పథకం, పామ్‌ ఆయిల్‌ పారిశ్రామిక సముదాయం, మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అప్‌ గ్రెడేషన్‌, మంచిర్యాల పట్టణం నుండి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ వరకు వయా అంతర్గాంను కలుపుతూ గోదావరి నదిపై ఎతైన వంతెన నిర్మాణాల శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.

నూతన సంక్షేమ పథకాలు
అనంతరం నూతన కలెక్టరేట్‌ వేదికగా ‘బీసీల్లోని కులవృత్తి, చేతి వృత్తి కులాల వారికి ‘ఆర్థికసాయం’ పథకం, రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం, ఇండ్ల జాగలేని నిరుపేదలైన లబ్ధిదారులకు, ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాలను సీఎం కేసిఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా తోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన కుందారపు మురళి (కుమ్మరి వృత్తి)కి, భీమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణ (నాయి బ్రాహ్మణ వృత్తి)కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు లక్ష రూపాయల చెక్కును తన చేతుల మీదుగా వారికి అందించారు.

రెండవ విడత గొర్రెల పంపిణీ
రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా తాడూరు మండలం ఖాజీపేట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్‌, బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గొలవేణి వోదేలుకు గొర్రెల పంపిణీకి సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్‌ అందించారు.

నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు
ఇండ్ల జాగలేని నిరుపేదలైన లబ్ధిదారులకు, పట్టాల పంపిణీలో హాజిపూర్‌ మండలం దోనబండ గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మీ, తోటపల్లి లావణ్యలకు సీఎం కేసీఆర్‌ ఇండ్ల స్థలాల పట్టాలను తన చేతులమీదుగా అందచేశారు.

ఈ కార్యకమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీలు జె.సంతోష్‌ కుమార్‌, బొర్లకుంట వెంకటేష్‌ నేత, చీఫ్‌ విప్‌ తానిపర్తి భానుప్రసాద్‌ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మధుసూదనాచారి, దండే విఠల్‌, తాటిపర్తి జీవన్‌రెడ్డి, కూర రఘోత్తమ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్య, అజ్మీరా రేఖానాయక్‌, కోరుకంట చందర్‌, జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌లు పుట్ట మధుకర్‌, నల్లాల భాగ్యలక్ష్మి, రాథోడ్‌ జనార్దన్‌, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, చీఫ్‌ ఇంజనీర్‌ జి. శ్రీనివాస్‌ రెడ్డి, డీసీపీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

చదువుల తల్లికి ప్రోత్సాహకం
మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చిరంజీవి శ్రీరాముల హరిత ఇంటర్మీడియట్‌ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని పొందింది. ఈ విషయాన్ని మంచిర్యాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ అమ్మాయిని పిలిపించుకుని ఘనంగా సన్మానించి ఐఎఎస్‌ కావాలని దీవించారు. ఇంకా ఉన్నత చదువులు చదుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా #హరిత ఉన్నత చదువులకై రూ.5 లక్షలు ఆర్థిక స#హయాన్ని సీఎం కేసిఆర్‌ ప్రకటించారు. హరిత తండ్రి శ్రీరాముల వెంకటేష్‌, తల్లి రాజశ్రీలను అభినందిస్తూ #హరితను ఉన్నత చదువులు చదివించాల్సిందిగా కోరారు.

ఏరియల్‌ వ్యూ
హెలికాప్టర్‌లో మంచిర్యాల వెళుతూ రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, మల్లన్న సాగర్‌, రంగనాయక్‌ సాగర్‌, అనంతగిరి, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు గోదావరి నీటితో నిండివున్న దృశ్యాన్ని చూసిన సీఎం కేసీఆర్‌ కళ్లనుండి ఆనంద భాష్పాలు రాలాయి. నడివేసవిలో కూడా నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టులను చూసి తనివి తీరా సంతృప్తి వ్యక్తం పడ్డారు. సుమారు 250 కిలోమీటర్ల మేర నీటితో, పచ్చని పంటపొలాలతో సజీవంగా మారడాన్ని చూసి సీఎం తన్మయత్వం చెందారు. పదేండ్లలో సాధించిన సాగునిటి ప్రగతిని చూసి సీఎం ఆనందంలో మునిగారు.

గంగమ్మకు జలహారతి పట్టిన సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ మంచిర్యాల పర్యటన ముగించుకొని హదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో సుందీళ్ల బ్యాక్‌వాటర్‌ వద్ద గోదావరి గంగకు జలహారతి పట్టారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణలతో పసుపు, కుంకుమ, సారే తదితరాలు పూజా సామాగ్రిని గోదావరి తల్లికి సమర్పించారు. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రస్థానంలో సాగునీటి రంగానికి, రైతాంగానికి జలాలు అందించిన గోదావరి మాతను తలుచుకున్నారు. తెలంగాణకు అదను అందిన పదునుగా నిలిచిన కాలేశ్వరం గోదావరి జలాలు తెలంగాణను భారతదేశ అన్నపూర్ణగా నిలిపిన నేపథ్యంలో, వ్యవసాయరంగంలో సాధించిన విజయాన్ని సీఎం కేసీఆర్‌ గోదావరి మాతకు పూజలు నిర్వ#హంచి కృతజ్ఞతలు సమర్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement