Friday, November 22, 2024

సింగరేణిని నిర్వీర్యం చేసిన కేసీఆర్ ప్రభుత్వం… భ‌ట్టి విక్ర‌మార్క‌

మార్చి, 29 బెల్లంపల్లి (ప్రభ న్యూస్) : దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటేనే సింగరేణి అని, అలాంటి సింగరేణిని కేసీఆర్ నిర్వీర్యం చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని తన క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాకముందు కేసీఆర్ బొగ్గుబాయి బొంబాయి దుబాయి అని చెప్పిన మాటలు, తెలంగాణ వచ్చి కేసీఆర్ పాలన 9 సంవత్సరాలు గడిచిన, బొగ్గు భాయ్ బతుకులు, బొంబాయి బతుకులు, దుబాయ్ బతుకులు మారలేదన్నారు. సింగరేణిలో ఒక లక్ష 5000 ఉన్న ఉద్యోగాలు నేడు 42 వేలకు వచ్చాయని, 60 వేలమంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి సింగరేణి సంపాదన దోచిపెడుతున్నారని మండిపడ్డారు.

నిజాం ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం చేసింది కేసీఆర్ మాత్రమేన‌ని, సింగరేణిలో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఎన్నికలు పెట్టకపోవడం, ఓటమి భయమే కారణమని తెలిపారు. స్థానిక ఎన్నికలు వస్తే తప్ప పథకాలు గుర్తు రావని, తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కుతున్నారని, ఈ 2023-2024 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపేన‌ని పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ పాద ఎల్లంపల్లి గోదారి నుండి నీళ్లు ఇచ్చేవారన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాదు చేతగాని చిన్నయ్య అని పేర్కొన్నారు. దేశంలో మోడీకి దేశద్రోహులు ఆర్థిక నేరస్తులే చుట్టాలని అన్నారు. రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ, ఇంటిని ఖాళీ చేయించడం జరుగుతుందని, అయినా రాహుల్ గాంధీ లోక్ సభకు గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ కుటుంబం వేలకోట్ల రూపాయల ఆస్తులను దేశానికి అంకితం చేశారని, సొంత ఇల్లు లేకుండా దశాబ్దాల నుండి రాజకీయాలు సాగిస్తున్నారని, దేశ ప్రజలు ఎప్పుడూ రాహుల్ కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ జడ్పీ చైర్మన్ సుజాత, రాష్ట్ర నాయకులు జగన్మోహన్, ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు బండి ప్రభాకర్, నియోజకవర్గ నాయకులు నా తర స్వామి, చిలుముల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement