Tuesday, November 26, 2024

కాసిపేటలో పాఠశాలల బంద్..

కాసిపేట : కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలను జారి చేశారు. దీంతో కాసిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేయనున్నారు.మండలంలో 22 ఎంపీపీ పాఠశాలలు, 23 పిడబ్లూపిఎస్‌, మూడు యూపిఎస్‌, ఐదు జెడ్‌పీఎస్‌ఎస్‌, మూడు ఆశ్రమ, కస్తూరిభా, మోడల్‌ పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆరు ప్రైవేట్ ‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల యందు ఒకటో తరగతి నుండి ఇంటర్‌ వరకు దాదాపు నాలుగు వేల మంది విధ్యార్థులు విధ్యను అభ్యసించుచున్నారు. గత ఏడాది మార్చి 19 నుండి పాఠశాలల లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకురాగ ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుండి తిరిగి విధ్యా సంస్థలను పునప్రారంభించిన విషయం తెలిసిందే…కోవిడ్‌ నిబంబధనల్లో పాఠాలు చెప్పాలనే ఆదేశాల అమలు చేస్తున్నప్పనటికి కొన్ని పాఠశాలల్లో కరోన కేసులు నమోదు కావడంతో విద్యాశాఖ అలర్ట్ అయింది. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం, పేరెంట్స్‌ ఆందోళనకు గురికాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విధ్మాశాఖ పేర్కొంది. అయితే మండంలోని ధర్మారావుపేట పాఠశాలలో ఒక ఉప్యాద్యాయుడికి కరోన పాజిటివ్‌ నమోదు కావడంతో పాఠశాలలో కరోన వ్యాధి నిర్ధారణ వైధ్య పరీక్షలు చేశారు. ఐతే పాజిటివ్‌ కేసులు నమోదు కాకవడంతో పిల్లల పేరెంట్స్‌, భోదన సిబ్బంది ఊరట చెందారు. అయితే విధ్యాసంస్థలు మూసివేసినప్పటికి ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతాయని తెలియచేయడం కొంత ఊరటనిచ్చినట్లైంది. ఏమైనా కరోన మాయదారి మహామ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపెడుతుండడంతో విధ్యతో పాటు అన్ని రంగాలు కుదేలవుతున్నాయనే అభిప్రాయం పలువురి నుండి వ్యక్తమవుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement