బెల్లంపల్లి : మేడే స్పూర్తితో సింగరేణిలో సింగరేణి హక్కుల సాధనకు ఉద్యమించాలని ఏఐసీటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌ఐజికేఎస్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు. మేడే కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు, సోషలిస్టు రాజ్య స్థాపనకు, సామ్రాజ్యవాదపతనానికి ఎక్కుపెట్టిన యుద్ధగాండీవం నుండి మెరుపులా దూసుకువచ్చిన ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని, తరతరాల
దోపిడిని చరమగీతం పాడాలని అన్నారు. మే 1వ తేదీని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుతున్నారన్నారు. మేడే కష్టజీవులకు నిజమైన పండుగరోజు అని, హక్కుల రక్షణ సాధనకు సమర శంఖారావం పూరించాల్సిన రోజు అని, దేశంలోని కార్మికులు ఏకతాటిపై నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, ఆరెపల్లి రమేష్, బర్ల స్రవంతి, రాజశేఖర్, అంబాల రాజన్న, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
కరపత్రాల విడుదల..
Advertisement
తాజా వార్తలు
Advertisement