Friday, September 13, 2024

ADB: బాసర అమ్మవారి సన్నిధిలో కడియం శ్రీహరి..

బాసర, ఆగస్టు 16( ప్రభ న్యూస్) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు మంగళ‌వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అమ్మవారి అక్షరాభ్యాస మండపంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మనవరాలికి అక్షరాభ్యాస పూజను ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, అర్చకులు జరిపించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ విజయరామరావు ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆశీర్వదించి, శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట బాసర కాంగ్రెస్ నాయకులు, పోలీసు సిబ్బంది వున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement