జన్నారం, (ఆంధ్రప్రభ) : ప్రజా ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, లోతుర్రే గోండుగూడ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం నిర్మాణ పనులకు, మురిమడుగు గ్రామంలో పౌల్ట్రీ షెడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ముందుగా పలు గ్రామాలలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తుందన్నారు. అనేక ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి,ఎం.పి.డి. ఒ ఠాగూర్ శశికళ,కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజాఫర్, మాణిక్యం, పార్టీ సీనియర్ నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, ఏనుగు సుభాష్ రెడ్డి, సుధాకర్ నాయక్, రమేష్, ముత్యం రాజన్న, ఫసిఉల్లా, సుధీర్‌కుమార్, లక్ష్మినారాయణ, ఇందయ్య, గంగాధర్, శంకర్, నందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.