చెన్నూర్, ప్రభన్యూస్: జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జాకు గురైందని ఆ భూమిని రక్షించాలని జర్నలిస్టులు తహసీల్దార్, సీఐ, మున్సిపల్ కమిషనర్లకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వం తమకు ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నెంబర్ 863 భూమిలో కొంతమంది రియల్ వ్యాపారం చేసేందుకు వ్యూహం రచించారని, తమ భూమిని కబ్జా చేస్తున్నారన్నారన్నారు.
గత పది సంవత్సరాల క్రితం (2014) గ్రీవెన్స్ లో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని కత్త రశాల రోడ్డులో గల సర్వే నంబర్ 863లో గల 8 ఎకరాల 5 గంటల భూమిని చెన్నూరు మండల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వర్తించే రిపోర్టర్ల కు ఇండ్ల నిర్మాణానికి అప్పటి రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ అందజేశారు. కొన్ని కారణాల వల్ల జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరగడంతో కొంతమంది బడాబాబులు రియల్ వ్యాపారులు ప్రోత్సహిస్తూ భూ దందకు తెరలేపరాని వెంటనే తమ అక్రమ భూ కబ్జా కార్యక్రమాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సుమారు 46మంది జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యాపారులు చేసే లవాదేవిల లో అమాయకులను బలి చేసే ప్రయత్నాలు చేస్తున్నారనీ వారు ఆరోపించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని పరి రక్షించి తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.