తలమడుగు (ప్రభ న్యూస్) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి పరుస్తానని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. ఇవాళ మండలం కేంద్రంలో బీజేపీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చేరుకున్న ఎంపీ గోడం నగేష్ మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మండలంలోని వెంకటేష్ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన విజయోత్సవ సభలో ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… ఈ విజయం పార్టీ కార్యకర్తలది, జిల్లా ప్రజలదని గుర్తు చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పనిలోనూ ముందుంటూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జిల్లాను అభివృద్ధి పరుస్తానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం మండల అధ్యక్షులు బోనగిరి స్వామి, ఉపాధ్యక్షులు నక్క ధనుంజయ్, ప్రధాన కార్యదర్శి ముత్యాల దేవన్న, బీజేవైఎం మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్, తాంసి జడ్పిటిసి రాజు, కనపర్తి, చంద్రకాంత్, వెంకటస్వామి, శార్త స్వామి, నాగార్జున రెడ్డి, కాంతారావు, ఓ బి సి మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి, పిట్ల శేఖర్, కిసాన్ మోర్ఛ అధ్యక్షులు ఆడెపు శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ బత్తుల ఆశన్న, నారాయణరెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.