Saturday, November 23, 2024

ఐఎన్‌టీయూసీ యూనియన్‌ నూతన కమిటీ..

శ్రీరాంపూర్: ఐఎన్‌టీయూసీ యూనియన్‌ బలోపేతం కోసం నూతన కమిటీను ఏర్పాటు చేశామని ఇందులో భాగంగానే శ్రీరాంపూర్‌ డివిజన్‌, ఎస్‌ఆర్‌పి-3, ఎస్‌ఆర్‌పి-3ఏకు నూతన కమిటీని ఏర్పాటు చేశామని ఐన్‌టీయూసీ సెక్రటరి జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ అన్నారు. నూతన కమిటీ ఫిట్‌ సెక్రటరిగా బొట్టు ప్రసాద్‌ (కోల్‌కట్టర్‌), 15 మంది సభ్యులను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా జనక్‌ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కోల్‌ మినిస్టర్‌, కల్‌ సెక్రటరిలకు లేఖలు రాస్తామని అన్నారు. కార్మికులకు వచ్చే రిటైర్డ్‌మెంట్‌ టెర్మినల్‌ బెనిఫిట్స్‌ను 6 నెలల దాటినా రావడం లేదని, నెలలోనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 11వ వేతన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి ఎన్నికల జాప్యంపై ఎన్‌ఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి రాజమౌళి, జనరల్‌ సెక్రటరి కాంపెల్లి సమ్మయ్య, జెట్టి శంకర్‌రావు, గరగ స్వామి, కొమ్ముల శ్రీనివాస్‌, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement