బెల్లంపల్లి: సింగరేణి ఏరియాసుపత్రిలోని కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పేషెంట్‌కు బెడ్ ఇవ్వాలని, అలాగే ఐసోలేషన్ కేంద్రంలో నూతనంగా మంజూరైన వెంటిలేటర్‌లను అవసరమున్న పేషెంట్లకు ఉపయోగించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్న వారిలో మనోధైర్యాన్ని నింపాలని సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు భరత్, భీమాగౌడ్, వైద్యులు అరవింద్, అనీల్ అన్నారు.
ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే..
By sree nivas
- Tags
- Adilabad Jilla News
- Adilabad Local News
- Adilabad News Live Today
- Adilabad News Today
- adilabad telugu news
- bellampally
- corona secund wave
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- mask
- mla durgam chinah
- sanitizer
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- Today news adilabad telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement