Friday, November 22, 2024

అంతరాష్ట్ర సరిహద్దు వంతెన వద్ద ముమ్మ‌ర తనిఖీలు

మంచిర్యాల ఇన్ చార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ నరేందర్ ఉత్తర్వుల ప్రకారం చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ నరేష్, ఎస్ఐ వెంకట్ లు రామగుండం కమిషనర్ రేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, జైపూర్ సబ్ డివిషన్, చెన్నూర్ రూరల్ సర్కిల్, కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషను పరిదిలోనీ ఫెర్రి పాయింట్స్, వాహనాల ఆకస్మిక తనిఖీకి, అదే విధంగా స్పెషల్ పార్టీ, టీఎస్ఎస్పీ, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఏరియా డామినేషన్, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని ఫెర్రీ పాయింట్స్ ని సందర్శించి, ఆ దారిలోని కల్వర్టులను చెక్ చేసి పడవలు నడిపెవారితొ మాట్లాడి సమాచారం తెలుసుకోవడం, మరియు చాపలు పట్టే వారితో మాట్లాడి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిసర గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మావోల అసాంఘిక కార్యకలపాలకు తావివ్వకుండా ముందస్తూగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటులో భాగంగా సిర్వంచ నుండి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ మీదుగా రాకపోకలను సాగిస్తున్న ఆర్టీసీ బస్ లను, వాహనలను, చెన్నూర్ ప్రాంతం నుండి వస్తున్న వాహనలను నిలిపి, అనుమానితులను ప్రశ్నించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ వెంకట్, ఎస్ ఐ నీల్వాయి నరేష్, స్పెషల్ పార్టీ మరియు టి ఎస్ ఎస్ పి ఫోర్స్,మరియు స్థానిక పోలీస్ సిబ్బంది 50 మంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement