బెల్లంపల్లి, జులై 24 (ప్రభ న్యూస్) : విద్యార్థులు పాఠశాలలో కూర్చున్నా వర్షానికి గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి మంచిర్యాల జిల్లా నెన్నల మండలం కుష్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలోని ఎనిమిదో తరగతి గదిపైన స్లాబ్ క్రాక్ ఇచ్చింది. వర్షం కురుస్తుండడంతో నీరంతా లోనికి వచ్చి లోపల ఉన్న ఐఎఫ్ బీ టీవీ చెడిపోయినది. తరగతి గదిలో పిల్లలు గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ పాఠశాలలో ఐదు తరగతులు ఉంటే మూడు తరగతులకు మాత్రమే తరగతి గదులున్నాయి. ఇప్పుడు ఇంకో తరగతి గది అందుబాటులో లేకుండా పోయింది. కావున అధికారులు స్పందించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుష్ణపల్లికి అదనపు తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.