Tuesday, November 26, 2024

డిపో ఏర్పాటుతో మెరుగైన ప్రయాణ సౌకర్యం : విప్ బాల్క సుమన్

చెన్నూర్ (ప్రభ న్యూస్) : చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసి బస్ డిపో నిర్మాణంతో చెన్నూరు కోటపెల్లి వేమనపెల్లి మండలాల ప్రజలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని హైవేరోడ్ సమీపంలో నాల్గు ఎకరాల భూమి లో నాల్గు కోట్ల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన ఆర్టీసి బస్ డిపోకు భూమి పూజ నిర్వహించి పనులను విప్ బాల్క సుమన్ ప్రారబించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ చెన్నూరు నియోజక వర్గ ప్రజలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజల చిరకాల స్వప్నం డిపో నిర్మాణంతో సాకారం కాబోతుందని అన్నారు. రెండు నెలల్లో డిపో నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు సేవలు అందేలా చూస్తమన్నారు.

డిపో నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి అడగగానే మంజూరు చేశారని అలాగే డిపో నిర్మాణం కొరకు కెటిఆర్ మంత్రి హరీష్ రావు లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 168 కోట్లతో చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వర్షాకాలం ముగిసిన వెంటనే మరో 1658 కోట్ల నిధులతో లక్ష ఎకరాకు సాగు నీరు అందేలా చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు ప్రారబించనున్నట్లు తెలిపారు. అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంటే మింగుడుపడని విపక్షాలు తమ ప్రభుత్వ పాలనలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామని ప్రబల్బలు చెబున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాల దుష్ప్రచారలను నమ్మవద్దని పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకులను తిరిగి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement