జన్నారం, నవంబర్ 11(ప్రభ న్యూస్): వచ్చే అసేంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రేస్ ఎంఎల్ఎలు గెలిస్తే వచ్చేవి మధ్యంతర ఎన్నికలేనని, బిజేపిని గెలిపిస్తే పేదోడే బిసి సిఎం అవుతాడని బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ అన్నారు.మంచిర్యాల జిల్లా ఖానాపూర్ అసేంబ్లీ నియోజక వర్గంలోని జన్నారం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం బిజేపి సింహ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ,రానున్న ఎన్నికల్లో దోరల పార్టీ అయిన బిఆర్ఎస్ ను గెలిపించినట్లయితే ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రి కేటిఆర్,అటు ఎంఎల్ సి కవిత,మంత్రి హరీష్ రావు,రాజ్యసభ సభ్యుడు సంతోష్ కొట్లాడి తప్పకుండా మధ్యంతర ఎన్నికలే వస్తాయన్నారు. కాంగ్రేస్ గెలిపిస్తే కాంగ్రేస్ లో రెడ్డిల రాజ్యంతో 10 మంది ముఖ్యమంత్రులంటు కొట్లాడుకుని తప్పకుండా మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
పేద ప్రజలు మధ్యంతర ఎన్నికలు కావాలా, హిందుత్వ నినాదంతో దేశం, రాష్ర్టం సుస్తిరంగా ఉంటాలని మోడి నాయకత్వంతో పేదడే బిసి సిఎం కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన చెప్పారు.ఓటర్లైన ప్రజలు డబ్బులు, మద్యం ఎవరు ఇచ్చినా తీసుకుని ప్రజా సేవలో ముందుండే బిజేపి ఖానాపూర్ ఎంఎల్ఎ అభ్యర్థి రాథోడ్ రమేష్ ను , మంచిర్యాలలో బిజేపి ఎంఎల్ ఎ అభ్యర్థి రఘునాథరావును ఓట్లు వేసి గెలిపిస్తే ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతున్నారు.పేదల పార్టీ అయిన బిజేపి నిరంతరం పేదల కోసమే చాలా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్రం పంపించే బిజేపి నిధుల వల్లనే అని ఆయన చెప్పారు. రాష్ర్ఠంలో కాంగ్రేస్ పరిపాలనను , తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పరిపాలనను ప్రజలు చూశారని, ఆ ప్రబుత్వాల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,నిధులు నియమాకాలు, ఉద్యోగాల పేరుతో ఏర్పడిన తెలంగాణాలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాకుండా కేవలం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబంలోని కెసిఆర్ కు సిఎం పదవి,కిటిఆర్ కు, హరీష్ రావు కు మంత్రి పదవులు కవితకు ఎంఎల్ సి పదవి,సంతోష్ రావుకు రాజ్యసభ పదవులతో ప్రతి నెల రూ.10లక్షల వరకు జీతాలు వస్తున్నాయని అన్నారు.
కోట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగాలు లేక యువత అష్టకష్టాలు పడుతుందని, పేదలు పేదలుగా ఉన్నారని, అవినీతి రాజ్యం ఎలుతుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్, మంచిర్యాల ఎంఎల్ ఎ అభ్యర్థులు రాథోడ్ రమేష్,రఘునాథరావు, బిజేపి జిల్లా, మండల నాయకులు రిథిష్ రాథోడ్,అజ్మీరా హరి నాయక్, కొంతం శంకరయ్య,తమ్మినేని శ్రీనివాస్, మధుసుధన్ రావు, గోలి చందు,నియోజక వర్గంలోని పలు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.