ఇచ్చోడ, 12 (ప్రభ న్యూస్) : ఒకటో తరగతిలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకు ఇంటి వద్దనే బొట్టు పెట్టి, బట్టలు పెట్టి, విద్యార్థికి బ్యాగు పలక ఇచ్చి, గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటించి పాఠశాలకు సర్పంచ్ గాడ్గే మీనాక్షి గౌరవంగా ఆహ్వానించారు. సర్కారు బడిని కాపాడుకోవాలన్న లక్షంతో ముఖ్రా కె సర్పంచ్ విన్నుతా ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇంటిటీకి తిరుగుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లల్ని చేర్పించాలని, ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి, తల్లిదండ్రులకు బట్టలు పెట్టి, విద్యార్థికి భ్యాగు, పలక ఇచ్చి, మొక్కలు నాటించారు. బడిబాటలో భాగంగా ప్రైవేట్ వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అంటూ.. ప్రైవేట్ లో వేస్తే 1000 రూపాయలు జరిమానా అని, ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే అన్ని సదుపాయాలు తామే కలిపిస్థామన్నారు. ఇ రోజు ఒకటవ తరగతిలో 21 మంది పిల్లలను చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్, ఉపాదాయులు సురేఖ, వినత రెడ్డి, శ్రీనివాస్ ఉపసర్పంచ్ వర్షా గ్రామస్తులు పాల్గొన్నారు.