Tuesday, October 22, 2024

TG | ఐ యామ్ నాట్ ఏ డ్రింకర్… యువ‌కుడు ఆత్మ‌హ‌త్య !

తాంసి (ఆదిలాబాద్‌) ఆంధ్రప్రభ : ఓ యువ‌కుడు ఐ యామ్ నాట్ ఏ డ్రింక‌ర్ అంటూ…. సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో తొలుత ప్ర‌మాద‌మ‌ని భావించినవారు… ఆ త‌రువాత‌ ఆత్మ‌హ‌త్య అని నిర్థార‌ణ‌కు వ‌చ్చారు.

ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల దేవన్న (38) హస్నాపూర్‌ శివారు బ్రిడ్జి నెంబర్‌ 188 వద్ద రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తొలుత ప్ర‌మాదంలో మృతి చెందాడ‌ని హ‌స్నాపూర్ గ్రామ‌స్థులు భావించి రైల్వే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

అయితే ఆయ‌న సెల్‌ఫోన్‌లో ల‌భించిన వీడియో ప్ర‌కారం సెల్పీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. ఐ యామ్ నాట్ ఏ డ్రింక‌ర్ అంటూ… ఆయ‌న వీడియోలో చెప్పిన మాట‌లు వైర‌ల్ అయ్యాయి. కాగా, మృతి చెందిన దేవ‌న్నకు భార్య‌, ఒక కుమారుడు ఉన్నారు.

ఆయ‌న భార్య‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా మ‌ద్యానికి బానిస అయ్యావ‌ని త‌ర‌చూ అంటున్నార‌ని, కానీ తాను తాగుబోతును కాద‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి వ‌చ్చాన‌ని, అలాగే మ‌రో అర‌గంట‌లో రైలు వ‌స్తుంద‌ని, చ‌నిపోతున్న‌ట్లు సెల్పీ వీడియో చివ‌రిగా మాట్లాడిన మాట‌లు రికార్డు అయ్యాయి.

ఆయ‌న మృతితో సొంత గ్రామ‌మైన పొన్నారి, అలాగే అత్త‌వారి ఊరు బండ‌ల్ నాగ‌పూర్ గ్రామాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆదిలాబాద్ రైల్వే పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement