చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కేపెల్లి గ్రామ పోడు భూముల వ్యవహారంలో జైలుకు వెళ్లి విడుదలైన రైతులను గ్రామానికి చెందిన పోడు రైతులు సన్మానించారు. గతంలో పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య జరిగిన ఘర్షణ కారణంగా అక్కేపెళ్ళి గ్రామానికి చెందిన ఆరుగురు రైతులపై కేసు నమోదైంది. దీనితో గత (మే) నెల 26న పోడు రైతులను లక్షటిపేట జైలుకు తరలించారు. పోడు భూముల సాగుకై ఫారెస్ట్ అధికారుల అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లి రావడాన్ని హర్షిస్తూ గ్రామస్తులు విడుదలైన రైతులను సన్మానించారు. అనంతరం మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇప్పటికైనా పోడు భూములు సాగు రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement