జన్నారం, ( ప్రభన్యూస్): నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. ఒక్క గేట్ ఎత్తి నీటిని గోదావరిలోకి ఇవ్వాల (బుధవారం) సాయంత్రం విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రాథోడ్ విట్టల్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 9వ నంబరు గేట్ ను 2 అడుగులు పైకిలేపి 2865 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతమైన గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 690.475 అడుగులు ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 8699 వస్తుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు గంట గంటకు పెరుగుతోంది. అందుకోసం గత అనుభవాల దృష్ట్యా గోదావరిలోకి నీటిని వదిలినట్టు అధికారులు తెలిపారు. దీంతో పరివాహక మండలాలైన కడెం, దస్తురాబాద్ ,జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట పశువుల, గొర్రెల కాపర్లు, జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement