Saturday, December 14, 2024

ADB | కొత్త‌ మెనూతో విద్యార్థుల ఆరోగ్యానికి మేలు.. అదనపు కలెక్టర్

జన్నారం, డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా ప్రవేశపెట్టిన మెనూతో విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావాత్ మోతీలాల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో శనివారం ప్రభుత్వం న్యూ కామన్ డైట్ మెనూను ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు మంచి భోజనం అందిస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే చక్కగా చదువుకుంటారని ఆయన చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్టల్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చక్కటి మెనూ తయారు చేయించి, ప్రతిరోజూ విద్యార్థులకు ఆ మెనూ ప్రకారం భోజనాలందించడం సంతోషకరమన్నారు. మండలం కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్థానిక తహసీల్దార్ సి.రాజ మనోహర్ రెడ్డి, కవ్వాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో స్థానిక ఎంపీడీఓ ఠాగూర్ శశికళ న్యూ మెనూ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి అధికారి బి.వినోద్ కుమార్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి రమేష్, ప్రధానోపాధ్యాయుడు శివరాజం, హాస్టల్ వెల్ఫేర్ అధికారిణి శాంత, ఎమ్మారై గంగరాజు, ఇన్చార్జి హెచ్.ఎం.రామస్వామి, హెచ్.డబ్ల్యు.ఓ అనసూయ, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement