Tuesday, November 26, 2024

గూడెంను కబలిస్తున్న కరోనా..

కాసిపేట : కరోనా మెల్ల మెల్లగా చాపకింద నీరులా గ్రామాన్ని చుట్టేస్తున్నది. మండలంలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదు చేసుకున్న గ్రామంగా రికార్డ్‌ నమోదు చేసుకుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నప్పటికి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసిపేట మండల కేంద్రానికి కూత వేటు దూరంలో రేగులగూడెం గ్రామం. ఆ గిరిజన గూడెంలో దాదాపు 70 కుటుంబాలు జీవిస్తున్నాయి.
కరోనా రెండవ వేవ్‌ విజృంబిస్తున్న నేపద్యంలో గ్రామంలో కోవిడ్‌ వ్యాది అంతకంతకు పెరుగుతూ గ్రామాన్ని ముంచెత్తెలా వుంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు గ్రామాల నుండి వచ్చిన 54 మందికి కరోనా వ్యాది నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 19 మందికి పాజిటివ్‌ నమోదు కాగా అందులో రేగులగూడెం గ్రామంలోనే 13 కేసులు నమోదు కావడం విశేషం. దీంతో ఇప్పటి వరకు గ్రామంలో మెత్తంగా 49 పాజిటివ్‌ భాదితులు వుండడం గమనార్హం. దాంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఇంత జరుగుతున్న స్థానికంగా ప్రజలు ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదని, బాద్యతరహితంగా వ్యవహరిస్తుండడం కారణంగానే గ్రామంలో కేసులు పెరుగుతున్నట్టు కొంత మంది స్థానికులు పేర్కొన్నారు. పాజిటివ్‌ నిర్దారణ అయిన వారు సైతం వారి వారి స్వంత పనులపై ఇతర గ్రామాలకు రాకపోకలు చేస్తున్నారని , వీరితో వ్యాది ఇతరులకు సులబంగా విస్తరించే అవకావాలున్నాయని పలువురు బాదను వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా గ్రామంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాము. రాంటెంకి శ్రీనివాస్‌. స్థానిక సర్పంచ్‌ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక సర్పంచ్‌ రాంటెంకి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రతి రోజు గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేపిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళనకలిగిస్తున్నదని, ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నప్పటికి కొంత మంది నిర్లక్ష్యం వలన కేసులు పెరుగుతున్నాయనే ఆనుమాణాలున్నాయని అన్నారు. కరోనా వలన కలిగే అనర్థాలపై అధికారులు, పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తే బాగుంటదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement