నిర్మల్ ప్రతినిధి, మార్చి 19 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ జానకి షర్మిల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బంది శారీరక దారుఢ్యం కోసం, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా కోసం ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలు మరియు మెలకువలు నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, చెక్ పోస్ట్ ల వద్ద డ్యూటీలు, వాహనాల ముమ్మర తనిఖీ, ఇతర పోలీస్ సంబంధిత విధుల నిర్వహణకు ఈ శిక్షణ ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ ఎస్ బి ఇన్ స్పెక్టర్, ఆర్.ఐ లు రామ్ నిరంజన్, శైలందర్, రామ కృష్ణ. ఆర్ఎస్సై లు వినోద్ , సాయి కృష్ణ, రాజ శేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.