నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు రోజుల క్రితం విద్యార్థులు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు విన్నవించడంతో ఆదివారం బాసరకు వచ్చారు. మొదట సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసర ఆలయ నిర్వాహకులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు చీరను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పని వాళ్ళు చేసుకోనివ్వాలంటూ పోలీసులను ఆదేశించారు. ఇక్కడి నుండి నేరుగా ట్రిపుల్ ఐటీ కళాశాలకు వెళ్లారు. అక్కడ ప్రధాన గేటు వద్ద బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ.డైరెక్టర్ సతీష్ కుమార్ లు ఆమెకు స్వాగతం పలికి కళాశాలలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కళాశాలలో కాలినడకన అన్ని ప్రదేశాలను సందర్శిస్తు విద్యార్థులతో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement